శ్రీశైలం జలాశయం: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
- శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం 878 అడుగులు
- ఇదే కొనసాగితే మరో 5 రోజుల్లో పూర్తి స్థాయికి జలాశయం
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదనీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 878 అడుగులు. ఇదే స్థాయిలో వరదనీరు వచ్చి చేరితే మరో ఐదు రోజుల్లో జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం.