ఏపీ: ఏపీ వంటి కీలక రాష్ట్రానికి చేయూత నివ్వాల్సిన అవసరం ఉంది: సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ రవాదారులు, జల రవాణా ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలపాలంటే ఏపీ కీలకం
  • రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా చేసేందుకు అవకాశాలు

ఏపీ వంటి కీలక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూత నివ్వాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడలో శంకుస్థాపన చేశారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలపాలంటే ఏపీ కీలకమని, ఇలాంటి రాష్ట్రానికి కేంద్రం చేయూత నిచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ ఎంతో సాయమందించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. కాకినాడ-పాండిచ్చేరి జల రవాణా మార్గం ద్వారా చౌక రవాణాకు ఆస్కారం ఉందని, కాలుష్య రహిత రవాణాకు దీని ద్వారా వీలు అవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ గా తయారు చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని, ఏపీ పురోగతికి నితిన్ గడ్కరీ సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.

  • Loading...

More Telugu News