లాస్ వెగాస్: లాస్ వెగాస్ ఘటనపై ట్రంప్ దిగ్భ్రాంతి!

  • లాస్ వెగాస్ ఘటన ఎంతో భయంకరం
  • బాధిత కుటుంబాలకు నా సానుభూతి
  • మృతుల ఆత్మలకు శాంతి కలగాలి
  • ‘ట్విట్టర్’, ‘ఫేస్ బుక్’ పోస్ట్స్ లో ట్రంప్ 

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన విషాద సంఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

కాగా, ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రంప్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘ఎంతో భయంకరమైన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ వారి కోసం నేను, మెలానియా దేవుడిని ప్రార్థిస్తున్నాం. యావత్తు దేశం కోసం, ఐక్యత, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం ...ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ బాధ నుంచి కోలుకునే శక్తిని బాధిత కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

  • Loading...

More Telugu News