విద్యుత్ సరఫరా నిలిపివేత: ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశాం: ట్రాన్స్ కో సీఎండీ
- ట్రాన్స్ కో సిబ్బంది అందరూ విధుల్లోనే
- టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఏర్పాటు
హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ మాట్లాడుతూ, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశామని అన్నారు. అయితే, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాన్స్ కో సిబ్బంది అందరూ విధుల్లోనే ఉంటారని టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఏర్పాటు చేశామని చెప్పారు.