లాస్ వెగాస్: అహింసావాది జయంతి నాడు ఇంత ఘోరమా!: రామ్ గోపాల్ వర్మ

  • ‘ఫేస్ బుక్’లో వర్మ పోస్ట్ ఆవేదన
  • ఈ సంఘటన ఎంతో విషాదంతో కూడుకున్న పరిహాసం

అమెరికా లాస్ వెగాస్ లోని  మండాలే బే హోటల్ లో మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపిన సంఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అహింసావాది జయంతి రోజున ఎంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకోవడం విషాదంతో కూడుకున్న పరిహాసమని తన ఫేస్ బుక్ ఖాతాలో వర్మ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ సంఘటనకు సంబంధించిన ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ, ‘ఈ రోజు గాంధీ జయంతి అని అమెరికన్లకు తెలియదు. మిస్ కమ్యూనికేషన్. ఈ రోజు గాంధీ జయంతి అనే వాస్తవాన్ని వారికి తెలియజెప్పారు’, ‘తుపాకులకు సెంటిమెంట్స్ ఉండవు’, ‘టెక్నికల్ గా చూస్తూ అమెరికాలో ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 1 రాత్రి’, ‘మీరు కొత్త సినిమా తీస్తారని ఊహిస్తున్నా’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News