కేటీఆర్: జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ కు కేటీఆర్ ఏమని సమాధానం చెప్పారంటే..!

  • ‘జాగ్రత్త కేటీఆర్ సార్!!! ‘జై’ దారిలో ఉన్నాడు’ అన్న అభిమాని
  • 'ఎన్టీఆర్ తనకు చాలా దగ్గరి మిత్రుడు’ అంటూ కేటీఆర్ ప్రతిస్పందన

విజయదశమి సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరు నెటిజన్లు రెండు పోస్ట్ లు చేశారు. అందులో ఒకటి, ‘రావణుడిని సంహరిద్దాం...హ్యాపీ దసరా’ అంటూ పది తలల రావణాసురుడి సంహారానికి బాణం ఎక్కు పెట్టి ఉన్న ఓ పోస్టర్...

‘ప్రతి ఒక్కరి ప్రారంభం ఒకేలా ఉంటుంది. కానీ, ముగింపును నిర్ణయించేది వారి ‘కర్మ’’ అంటూ ‘రామ్, రావణా’ అర్థాలు వచ్చే పోస్టర్ ను మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఈ రెండు మెస్సేజ్ లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అయితే, ‘రావణుడిని సంహరిద్దాం...హ్యాపీ దసరా’ అనే దానిపై జూనియర్ ఎన్టీఆర్ అబిమాని ఒకరు స్పందిస్తూ ..‘ జాగ్రత్త కేటీఆర్ సార్!!! ‘జై’ దారిలో ఉన్నాడు’ అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

 ఈ అభిమాని ట్వీట్ పై స్పందించిన కేటీఆర్..‘ఏం బాధపడకు మిత్రమా. జూనియర్ ఎన్టీఆర్ నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరి మిత్రుడు. ‘జై’ గురించిన బాధ్యత అతను చూసుకుంటాడని కచ్చితంగా చెప్పగలను’ అంటూ తన దైన శైలిలో ఆయన ‘పంచ్’ వేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News