కాల్పుల కలకలం: అమెరికాలో కాల్పుల కలకలం రేపిన దుండగుడిని గుర్తించిన పోలీసులు.. మహిళ సాయంతో కాల్పులు

  • అత‌డికి స‌హ‌క‌రించిన ఓ మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • వేరే హోటల్ లో 32వ అంత‌స్తులో బ‌స‌ చేసిన నిందితుడు
  • నిందితుడు బస చేసిన గ‌దిలో తుపాకులు స్వాధీనం

అమెరికా లాస్‌వెగాస్‌లోని మండాలే బే హోట‌ల్‌లో దుండగుడు జ‌రిపిన కాల్పుల్లో 50 మందికి పైగా మృతి చెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయాలు అయ్యాయ‌న్న విష‌యం తెలిసిందే. ఈ కాల్పుల‌కు పాల్ప‌డ్డ దుండ‌గుడిని కాల్చి చంపిన పోలీసులు అత‌డి వివ‌రాల‌ను గుర్తించారు.

అత‌డిని స్టీఫెన్ పెడాక్ (64) గా గుర్తించిన పోలీసులు.. అత‌డికి స‌హ‌క‌రించిన ఓ మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు.  స్టీఫెన్ పెడాక్ మండేలే బే  హోట‌ల్‌కి స‌మీపంలోని మరో హోటల్ లో 32వ అంత‌స్తులో బ‌స‌చేశాడని, అత‌డి గ‌ది నుంచి కొన్ని తుపాకులు స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు.

అత‌డి పూర్తి వివ‌రాలు, అడ్ర‌స్ తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. ఈ కాల్పుల ఘ‌ట‌న బాధితుల వివ‌రాల గురించి తెలుసుకోవాలంటే, వారి కుటుంబ స‌భ్యులు 1-888-535-5654 నెంబ‌రుకి ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. 

  • Loading...

More Telugu News