‘ఎన్టీఆర్’: ‘ఎన్టీఆర్’ గృహాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • లక్ష ‘ఎన్టీఆర్’ గృహాలు ప్రారంభం
  • పేదల సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా
  • ఒక్క పైసా అవినీతి జరిగినా కఠిన చర్యలు తప్పవు 

ఏపీలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన నూతన గృహాలను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష ఎన్టీఆర్ గృహాలను విజయవాడ నుంచి ఆయన ఆవిష్కరించారు. అనంతరం, చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, గతంలో తాను చేపట్టిన పాదయాత్ర ద్వారా పేదవాళ్ల సమస్యలన్నీ తెలుసుకున్నానని, వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు.

 పేద వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగంలో పేదవాళ్లు ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో ఒక్కపైసా అవినీతి జరిగినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.  

  • Loading...

More Telugu News