పరిలాట: పరిటాల శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- శ్రీరామ్ కు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు
- కృతజ్ఞతలు చెప్పిన నవ వరుడు
ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు శ్రీరామ్ తన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ వివాహం జ్ఞానతో జరిగింది.