అల్లు రామలింగయ్య: మా తాతయ్యను ఎప్పటికీ మిస్సవుతూనే ఉంటాం: అల్లు అర్జున్

  • ఈరోజు అల్లు రామలింగయ్య జయంతి
  • తాతయ్యను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్, శిరీష్
  • ఐదు దశాబ్దాల్లో 1013 చిత్రాల్లో నటించిన రామలింగయ్య 

ఈ రోజు నాటి ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య మనవలు, ప్రముఖ సినీ నటులు అల్లు అర్జున్, అతని సోదరుడు అల్లు శిరీష్ ఆయన్ని గుర్తుచేసుకున్నారు.

‘ఈరోజు మా తాతయ్య జయంతి. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం ఆయనే. ఆయన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే వుంటాం’ అని అల్లు అర్జున్, ‘ఆయన్ని గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలుపుతున్న వారందరికీ ధన్యవాదాలు. ఐదు దశాబ్దాల్లో 1013 చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిపెట్టారు’ అని అల్లు శిరీష్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News