టీటీడీ కొత్త చైర్మన్: నేను పక్కా హిందువుని: పీఠాధిపతి ఆరోపణలకు పుట్టా సుధాకర్ యాదవ్ సమాధానం

  • శైవక్షేత్రం పీఠాధిపతి వ్యాఖ్యలను ఖండిస్తున్నా
  • పీఠాధిపతులంటే నాకు ఎనలేని గౌరవం
  • కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లతో నాకు సంబంధం లేదు

టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడాన్ని తాళ్లాయపాలెం శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుధాకర్ యాదవ్ స్పందిస్తూ, తాను పక్కా హిందువునని, క్రిస్టియన్ సంస్థలకు తాను మద్దతు ఇస్తున్నానని చెప్పడం అవాస్తవమని అన్నారు.

 పీఠాధిపతులంటే తనకు ఎనలేని గౌరవమని, హిందూ ధర్మం కోసం తాను పాటుపడుతున్నానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ ఆహ్వానిస్తారని, కార్యకర్తల పిలుపు మేరకు ఆయా కార్యక్రమాలకు హాజరు కావడం సహజమని అన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న బ్యానర్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కూడా దేవాలయాల నిర్మాణానికి టీటీడీ బోర్డు సభ్యుడిగా నిధులు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.  

  • Loading...

More Telugu News