పుట్టా సుధాకర్: టీటీడీ కొత్త చైర్మన్ గా సుధాకర్ నియామకం తగదు: శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి
- సుధాకర్ క్రిస్టియన్ సభలకు వెళుతుంటారు
- ఆ సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణ
టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై వ్యతిరేకత వ్యక్తమైంది. సుధాకర్ ని నియమించడంపై గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మంపై పూర్తి విశ్వాసం ఉన్న వారికే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని, క్రిస్టియన్ సంస్థలతో సుధాకర్ యాదవ్ సన్నిహితంగా ఉంటారని, సుధాకర్ క్రిస్టియన్ సభలకు పలు సార్లు హాజరయ్యారని ఈ సందర్భంగా ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా సుధాకర్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.