తమ్మారెడ్డి భరద్వాజ: విశ్లేషకులు ‘హిట్’ అన్నా.. ‘ఫట్’ అన్నా ఆడే సినిమా ఆడుతోంది!: తమ్మారెడ్డి భరద్వాజ

  • వద్దని చెప్పినా విశ్లేషణలు చేస్తూనే ఉంటారు
  • సినిమాలో దమ్ముంటే  ఎవ్వడూ దేన్నీ ఆపలేడు
  • తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ

సినిమాలో దమ్ముంటే దానిని ఎవ్వడూ ఆపలేడని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘సినీ విశ్లేషకులు విశ్లేషణ చేస్తూనే ఉంటారు. మనం వద్దని చెప్పినా చేస్తారు. చెయ్యనివ్వండి.. సినిమాకు గానీ, ఇండస్ట్రీకి గాని దీని వల్ల వచ్చే నష్టమేమి లేదు. వారితో పరస్పరం కలిసి ఉంటాం కాబట్టి రాయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదంటే.. ఓకే, వెల్ అండ్ గుడ్. సినిమాలో దమ్ముంటే ఎవ్వడూ దేన్నీ ఆపలేడు. వాళ్లు ‘హిట్’ అన్నా ‘ఫట్’ అన్నా..ఆడే సినిమా ఆడుతోంది. ఈ విషయమై ఎక్కువగా చర్చలు జరపడం అనవసరం’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News