క్రికెట్: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • టీమిండియా స్కోరు 39 ఓవర్లకి 233
  • క్రీజులో కేదార్ జాదవ్ (47), మనీష్ పాండే (1)

బెంగళూరు వ‌న్డేలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 335 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బ్యాటింగ్ ప్రారంభించిన‌ టీమిండియా అజింక్యా రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లను కోల్పోయిన విషయం తెలిసిందే. 40 బంతుల్లో 41 పరుగులు చేసిన హార్థిక్ పాండ్యా ఆడమ్ జంపా బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి మనీష్ పాండే వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 39 ఓవర్లకి 233 గా ఉంది. క్రీజులో కేదార్ జాదవ్ 47, మనీష్ పాండే 1 పరుగులతో ఉన్నారు.
టీమిండియా బ్యాట్స్ మెన్ లలో ర‌హానే 53, రోహిత్ శ‌ర్మ 65 (ర‌నౌట్), విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశారు. 

  • Loading...

More Telugu News