క్రికెట్: టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చిన ఆస్ట్రేలియా!

  • నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 334 ప‌రుగులు  
  • డేవిడ్ వార్న‌ర్ 124, ఫించ్ 94 పరుగులు
  • ఉమేశ్ యాద‌వ్ కు 4 వికెట్లు

బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా మధ్య జ‌రుగుతోన్న‌ నాలుగో వ‌న్డే మ్యాచ్ లో టీమిండియా ముందు ఆసీస్ భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, ఫించ్‌ రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా 334 ప‌రుగులు చేసింది.

డేవిడ్ వార్న‌ర్ 124 ( 119 బంతుల్లో), ఫించ్ 94 (96), ట్రావిస్ హెడ్ 29 (38), కెప్టెన్‌ స్టీవెన్ స్మిత్ 3 (5), పెటెర్ హ్యాండ్స్‌కాంబ్ 43 (30), మార్క‌స్ స్టోయినిస్ 15 (9) నాటౌట్‌, మ్యాథ్యూ వేడ్ 3 (3) నాటౌట్‌ ప‌రుగులు చేశారు. టీమిండియా బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్ 4 వికెట్లు తీయ‌గా, కేదార్ జాద‌వ్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్‌కి ఎక్స్‌ట్రాల రూపంలో 23 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో ఐదు వికెట్ల న‌ష్టానికి 334 ప‌రుగులు చేసింది.  

  • Loading...

More Telugu News