ఐఐటీ ఢిల్లీ: ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ విద్యార్థికి చేదు అనుభవం..చట్నీలో చనిపోయిన ఎలుక!

  • ఆరావళి వసతి గృహంలో సంఘటన
  • అధికారులకు ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థి

ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీ హాస్టల్ లో అల్పాహారం చేస్తున్న ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. చట్నీలో చనిపోయిన ఎలుక శరీరభాగాలు కనిపించడంతో సదరు విద్యార్థి ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ లోని ఆరావళి వసతిగృహంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని వసతిగృహ ఉన్నతాధికారుల దృష్టికి సదరు విద్యార్థి తీసుకువెళ్లాడు. ఈ సంఘటనపై విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News