పవన్ కల్యాణ్: త్రివిక్రమ్ - పవన్ సినిమాలో ఉదయభాను?
- ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనున్న ఉదయభాను?
- ఆమెతో త్రివిక్రమ్ సంప్రదింపులు
- గతంలోనూ త్రివిక్రమ్ సినిమాలో ఉదయభాను స్పెషల్ సాంగ్
ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన నాయికలుగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయమేంటంటే, ఓ స్పెషల్ సాంగ్ లో ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కనిపించనుందట.
ఈ స్పెషల్ సాంగ్ విషయమై త్రివిక్రమ్ ఇప్పటికే ఉదయభానుతో సంప్రదింపులు జరిపినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, స్పెషల్ సాంగ్స్ లో నటించడం ఉదయభానుకు కొత్తేమీ కాదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గతంలో విడుదలైన ‘లీడర్’ చిత్రంలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’లోను స్పెషల్ సాంగ్స్ లో ఉదయభాను నటించింది. ఇదిలా ఉండగా, చాలా కాలంగా టీవీ షోలకు, సినిమాలకు దూరంగా ఉన్న ఉదయభాను, ‘నీ తోనే డ్యాన్స్’ అనే ఓ రియాల్టీ షోతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.