cric: బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా!
- బెంగళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా నాలుగో వన్డే
- టాస్ గెలిచిన ఆసీస్
- క్రీజులో ఆసీస్ ఓపెనర్లు ఫించ్, వార్నర్
- నాలుగు ఓవర్లకి ఆసీస్ స్కోర్ 29
బెంగళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 3-0తో సాధించిన విషయం తెలిసిందే. క్రీజులో ఆసీస్ ఓపెనర్లు ఫించ్, వార్నర్ ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు నాలుగు ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 29గా ఉంది.
భారత జట్టు: ఆజింక్య రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, ధోనీ, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, యజ్వేంద్ర చాహల్, కేదార్ జాదవ్.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కాంబ్, మాథ్యూ వేడ్, పాట్ కమ్మిన్స్,కౌల్టర్ నైల్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టాయినిస్.