ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్: సిరీస్ కోల్పోవడం చాలా బాధించింది: ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

  • నాల్గో వన్డేను ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం
  • ఇంకా ఆడాల్సిన మ్యాచ్ లలో ఏదైనా జరగొచ్చన్న వార్నర్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇంకా, రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ సిరీస్ ను భారతజట్టు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ, మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ సిరీస్ ను కోల్పోవడం తమను చాలా బాధించిందని వాపోయాడు.

అయితే, రేపు బెంగళూరులో జరగనున్న నాల్గో వన్డేను ఛాలెంజ్ గా తీసుకుని, జట్టు విజయం కోసం పాటుపడతామని అన్నాడు. ఐదు వన్డేల సిరీస్ కోల్పోయినప్పటికీ, ఇంకా రెండు మ్యాచ్ లు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉందని, ఈ మ్యాచ్ లలో ఏదైనా జరగవచ్చని అన్నాడు. అన్నట్టు, రేపు జరిగే మ్యాచ్ వార్నర్ కు వందవ వన్డే. దీంతో ఈ మ్యాచ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని, బాగా ఆడడానికి ప్రయత్నిస్తానని అన్నాడు.  

  • Loading...

More Telugu News