తిరుమల: తిరుమలలో మమ్మల్ని పట్టించుకోవడం లేదు: సామాన్య భక్తుల ఆగ్రహం

  • తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ 
  • వీవీఐపీల కోసం ‘రామ్ బగీచ’ బస్టాండ్ సమీపంలో రహదారి మూసివేత
  • గ్యాలరీల్లోకి వెళ్లేందుకు దారి తెలియక భక్తుల ఇబ్బంది!

తిరుమలలో వీఐపీ, వీవీఐపీలకు అధిక ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవడం లేదంటూ సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు గరుడ వాహన సేవ అద్భుతంగా జరుగుతోంది. అయితే, ఈ సేవకు వీవీఐపీలను తీసుకువెళ్లేందుకు వీలుగా రామ్ బగీచ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న బస్టాండ్ సమీపంలో రహదారిని అధికారులు మూసివేశారు.

దీంతో, గ్యాలరీల్లోకి వెళ్లేందుకు దారి తెలియక భక్తులు ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారుల తీరుపై సామాన్యభక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గరుడ వాహన సేవకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

  • Loading...

More Telugu News