అమరావతి: చిన్న నిర్మాతలను అన్ని విధాలా ఆదుకుంటాం: అంబికా కృష్ణ

  • ఏపీలో నిర్మించే చిత్రాలకు రాయితీల కల్పనకు కృషి 
  • 30న విజయవాడలో చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

చిన్న నిర్మాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు త్వరలోనే విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారి ఏర్పాటు చేసిన ఆలూరి సినీ క్రియేషన్స్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ, ఈ నెల 30న విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలో చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్రంలో నిర్మించనున్న చిత్రాలకు రాయితీలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం, ఆలూరి సినీ క్రియేషన్స్ అధినేత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ, వచ్చే పదేళ్లలో వంద సినిమాలు తీసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News