కంచ ఐలయ్య: కంచ ఐలయ్యపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఎంపీ టీజీ వెంకటేశ్
ఓ మతాన్ని, కులాన్ని అవమానపరిచేలా రాతలు రాసే మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య లాంటి వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అమాయకుల మృతికి కారణం కావొద్దని, చిచ్చు పెట్టే విధంగా రాతలు రాసిన కంచ ఐలయ్యను ఉరితీయాలని, అవసరమైతే చట్టాలను మార్చాలని వ్యాఖ్యానించారు. కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని వెంటనే నిషేధిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.