: రక్తంలోని ప్లేట్‌లెట్‌లు జుట్టును మొలిపిస్తాయి
దేహ సౌందర్యానికి సంబంధించిన చికిత్సల్లో మన రక్తంలోని ప్లేట్‌లెట్‌లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన రక్తం నుంచి సేకరించే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజక్షన్లను ఉపయోగించి.. ముఖం, చేతులపై వృద్దాప్య ఛాయలను ఎదుర్కొనడానికి ఇప్పటికే రకరకాల చికిత్సలు ఉన్నాయి. అయితే ఇదే తరహా రక్తం చికిత్స ద్వారా బట్టతలపై తిరిగి జుట్టును కూడా మొలిపించవచ్చునని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ పద్దతి కనుగొన్నారు.
వ్యక్తి నుంచి సేకరించిన రక్తంతోకూడిన ద్రావణాన్ని జుట్టు ఊడిపోయిన చోట ఎక్కిస్తారు. ఇది చర్మం కింద ఉండే మూల కణాలను ప్రేరేపించడం ద్వారా వెంట్రుకలు తిరిగి మొలిచేలా చేస్తుంది. ఇంటర్నేషనల్ హెయిర్ రీసెర్చి ఫౌండేషన్, ఇటలీలోని బ్రెస్కియా వర్సిటీ, ఇజ్రాయిల్ హీబ్రూ వర్సిటీకి చెందిన వారు ఈ పద్ధతిని కనుగొన్నారు. 45 మందిని శాంపిల్‌గా తీసుకుని తలభాగంలో వీరి రక్తాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా వెంట్రుకలు ఓ మోస్తరు స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించారు.