‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ!


టీడీపీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరిట ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బ్లూ కలర్ చీర ధరించిన ఓ మహిళ ఇంట్లోకి వెళుతుండగా, ఇంట్లో కుర్చీలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి అస్పష్టంగా కనపడుతుంటారు.

ఈ చిత్రం టైటిల్ లోని ‘లక్ష్మీస్’ పదాన్ని ఎరుపు రంగులోను, ‘ఎన్టీఆర్’ పదాన్ని పసుపు రంగులోను డిజైన్ చేయడం గమనార్హం. ఇక, ఫస్ట్ లుక్ పోస్టర్ పై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. ‘వాస్తవాలు ఈ చిత్రం ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం’, ‘చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’, ‘పెద్దాయన్ని గొప్పగా చూపండి గురూజీ’, ‘రామ్ గోపాల్ వర్మ సినిమాలో మోషన్ పోస్టర్లు, ఫస్ట్ లుక్ ట్రైలర్స్ మాత్రం బాగుంటాయి. ఆ తర్వాత అంతా డిజాస్టరే’, ‘సార్, మీరు ఎన్నో ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు, కానీ, మూవీలు అయితే ఇంకా రిలీజ్ అవట్లేదు’ అంటూ నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

  • Loading...

More Telugu News