modi: మన్మోహన్ సింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: మోదీ
- నేడు మన్మోహన్ సింగ్ 85వ పుట్టిన రోజు
- 1932లో పంజాబ్లో జన్మించిన మన్మోహన్
- సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా జీవించాలని మోదీ ట్వీట్
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా జీవించాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 2004లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మన్మోహన్ సింగ్ 2009లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలవడంతో మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ 1932లో పంజాబ్లో జన్మించారు. ఆయనకు ఇది 85వ పుట్టిన రోజు.