స్పైడర్: ‘స్పైడర్’ నా కెరీర్ లో మరో అద్భుత చిత్రం కానుంది: హీరో మహేష్ బాబు

  • ‘స్పైడర్’ యూనివర్శల్  కథాంశం
  • తమిళంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా
  • మా నాన్న మంచి క్రిటిక్
  • మా తండ్రి నటించిన సినిమాలను రీమేక్ చేయను
  • ఒక్కడు, పోకిరి, అతడు.. నా కెరీర్ ను మలుపు తిప్పాయి
  • తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు

‘స్పైడర్’ స్క్రిప్ట్ ను ఎంతో అద్భుతంగా మురుగదాస్ తనకు చెప్పారని హీరో మహేష్ బాబు అన్నాడు. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ, ‘ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ ఎగ్జైట్ అవుతారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఓ ఆఫీసర్ పాత్రను ఈ చిత్రంలో నేను పోషించాను. మురుగదాస్ వంటి దర్శకులు మాత్రమే ఇటువంటి సినిమాలను చేయగలరు. తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకే రోజు విడుదలవుతుంది. తమిళంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను.

ఈ సినిమా కథ యూనివర్శల్ కాన్సెప్ట్. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ..ఇలా ప్రతిఒక్కరూ చూడదగిన చిత్రం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. రకుల్ పర్ఫార్మెన్స్ అద్భుతం’ అన్నాడు మహేష్. తనకు ఇన్స్ పిరేషన్ తన తండ్రి కృష్ణనేనని, ఆయన ఎన్నో గొప్ప పాత్రల్లో నటించారని చెప్పాడు. ఆయనది చాలా డేరింగ్ యాటిట్యూట్ అని, తనకు అంత లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఏదైనా నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని ఉన్నది ఉన్నట్టు తన తండ్రి చెప్పేస్తారని, ఆయన నిజమైన క్రిటిక్ అని అన్నాడు.

‘మా నాన్న నటించిన సినిమాలను రీ మేక్ చేసి వాటిల్లో నటించాలని నేనెప్పుడూ అనుకోను. ఎందుకంటే, ఆయనకు నేను పెద్ద అభిమానిని. అసలు, రీమేక్ చేయాలనే ఆలోచనే నాకు రాదు. నేను నటించిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు.. ఈ చిత్రాలన్నీ నా కెరీర్ ను మలిచాయి. ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. ఒక్కడు సినిమా తర్వాతే నేను స్టార్ అయ్యాను. అంతకుముందు వరకు, చాలా స్ట్రగుల్ అయ్యాను.

ఆ తర్వాత 'అతడు' సినిమా నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరగా తీసుకువెళ్లింది. పోకిరి సినిమా నాకో కొత్త స్టేటస్ ఇచ్చింది. 'దూకుడు' సినిమా నాకు టర్నింగ్ పాయింట్. శ్రీమంతుడు సినిమా నాకు చాలా ముఖ్యమైంది. ఈ చిత్రాలన్నీ నా కెరీర్ ను మలిచాయి. శ్రీమంతుడు సినిమా తర్వాత చాలా మంది గ్రామాలను దత్తత తీసుకోవడం గర్వంగా.. సంతోషంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాల తర్వాత ‘స్పైడర్’ నా కెరీర్ లో మరో ముఖ్యమైన చిత్రం కానుంది’ అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News