వైఎస్ జగన్: వైఎస్ జగన్ పాదయాత్ర వాయిదా?
- నవంబర్ మొదటి వారానికి వాయిదా పడ్డ పాదయాత్ర
- కోర్టు కేసులు, పార్టీ కార్యక్రమాలు ఆలస్యం కావడం వల్లే ఈ నిర్ణయం?
- వైసీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది
ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్టు తెలుస్తోంది. కోర్టు కేసులు, పార్టీ కార్యక్రమాలు ఆలస్యం కావడం కారణంగా ఈ పాదయాత్రను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసినట్టు పార్టీ నేతల సమాచారం. అయితే, ఈ పాదయాత్ర వాయిదాపడ్డ విషయాన్ని వైసీపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మరోపక్క, విజయవాడలో జరగాల్సిన వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా ఈ నెల 27కు వాయిదా పడినట్టు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుంచి జిల్లాల వారీగా జగన్ పర్యటించనున్నారని, పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు జరుపుతారని సమాచారం. కాగా, వైసీపీ ప్లీనరీ వేదికగా అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తానని జగన్ గతంలో ప్రకటించిన సంగతి విదితమే.