పాండ్యా: పాండ్యపై ప్రశంసలు కురిపించిన శ్రీలంక ఆటగాడు

  • కుమార సంగక్కర ట్వీట్
  • పాండ్యా ఓ ప్రత్యేకమైన ఆటగాడు
  • ఏ పరిస్థితుల్లోనైనా ఆడే స్థితిలో టీమిండియా ఉందంటూ కితాబు

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న జరిగిన మూడో వన్డేలో చెలరేగి ఆడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఈ సిరీస్ ను టీమిండియా గెలిచింది. హార్దిక్ పాండ్యా చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఆడేలా పరిపూర్ణ స్థితిలో టీమిండియా ఉంది’ అని తన ట్వీట్ లో కుమార సంగక్కర ప్రశంసించాడు.

ఈ ట్వీట్ పై స్పందించిన పాండ్యా..‘మీ వ్యాఖ్యలకు నా కృతఙ్ఞతలు సార్’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కాగా, చెన్నైలో జరిగిన మ్యాచ్ లోనూ, నిన్న ఇండోర్ లో జరిగిన మ్యాచ్ లోనూ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయానికి దోహదపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల్లో భాగంగా ఈ నెల 28న బెంగళూరులో నాల్గో వన్డే జరగనుంది.

  • Loading...

More Telugu News