దీపక్ : 75 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత కేవలం మూడురోజులే స్పృహలో ఉన్నారు: జయ మేనల్లుడి ప్రకటన
- జయలలిత మృతి విషయంలో ఎలాంటి దాపరికం లేదు
- జయలలితను ఆసుపత్రిలో చేర్చినప్పటి వీడియో శశకళ వద్ద ఉంది: దినకరన్
- విచారణ కమిషన్‌కు వీడియో ఆధారాలు అందిస్తాం
గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5న గుండెపోటుతో కన్నుమూశారని వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జయలలిత మృతిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. నిన్న ఆ రాష్ట్రమంత్రి దిండిగల్ శ్రీనివాసన్ తాము ఆనాడు అన్నీ అబద్ధాలు చెప్పామని తెలుపుతూ శశికళ కుటుంబంపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై దినకరన్, జయలలిత మేనల్లుడు దీపక్ స్పందించారు.
75 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత మూడురోజులే స్పృహలో ఉన్నారని దీపక్ చెప్పారు. జయలలిత మృతి వెనుక ఎలాంటి దాపరికం లేదని వ్యాఖ్యానించారు. దినకరన్ స్పందిస్తూ జయలలితను చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చినప్పటి వీడియో శశకళ వద్ద ఉందని అన్నారు. విచారణ కమిషన్‌కు వీడియో ఆధారాలు అందిస్తామని తెలిపారు.