రెజీనా: నేను మంచి గాడ్ మదర్ ని అయ్యేందుకు ప్రయత్నిస్తా!: హీరోయిన్ రెజీనా
- ‘ఇన్ స్టా గ్రామ్’ లో రెజీనా పోస్ట్
- నాకు దేవుడిచ్చిన బిడ్డ చిన్నారి జోలీ డేనియల్
ఓ బిడ్డకు తాను తల్లినయ్యానంటూ హీరోయిన్ రెజీనా కసాండ్రియా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే, పెళ్లే కాలేదు, తల్లి కావడం ఏంటనే అనుమానం అభిమానులకు, ప్రేక్షకులకు తలెత్తకమానదని గ్రహించిన రెజీనా ఈ విషయమై స్పష్టత నిస్తూ పోస్ట్ చేసింది.
‘దేవుడిచ్చిన బిడ్డ జోలీ డేనియల్ ను కలిశాను. నిజంగా, ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. దేవుడిచ్చిన బిడ్డకు మంచి గాడ్ మదర్ గా ఉండేందుకు ప్రయత్నిస్తా..’ అంటూ రెజీనా తన పోస్ట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా జోలీ డేనియల్ తో ఉన్న ఫొటోలను రెజీనా పోస్ట్ చేసింది. రెజీనా ఈ పోస్ట్ చేసినా కొన్ని గంటల్లోపే అధిక సంఖ్యలో లైక్స్ వచ్చాయి.