రహానె: టీమిండియాకు మరో వికెట్ లాస్: రహానే ఔట్
- 70 పరుగుల వద్ద రహానే ఔట్
- అభిమానుల నిరుత్సాహం
- క్రీజ్ లో కోహ్లీ, పాండ్యా
ఆసీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్ లో ఓపెనర్ రహానె (70) ఎల్ బీడబ్ల్యూ కావడంతో పెవిలియన్ చేరాడు. స్కోర్ బోర్డును ఓపెనర్లు రహానే, శర్మ పరుగులు పెట్టించారు. అయితే, శర్మ ఔట్ అయిన కొంచెం సేపటికే రహానే వికెట్ పడిపోవడంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు ఉన్నారు. పాండ్యా ఇప్పటివరకు ఆడిన ఆరు బంతుల్లో 8 పరుగులు చేయగా అందులో ఒక సిక్స్ బాదాడు. 25 ఓవర్లలో టీమిండియా స్కోర్: 157/2