ఇండోర్ వన్డే: ఇండోర్ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు

  • మూడో వన్డేలో ఆసక్తికర పోరు 
  • గెలుపు కోసం టీమిండియా, ఆసీస్ జట్లు
  • క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఆసీస్ పై వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన టీమిండియా జట్టు మూడో వన్డేలో విజయం సాధించి ఈ సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో, ఈ మ్యాచ్ లో విజయం సాధించి బోణీ కొట్టేందుకు ఆసీస్ జట్టు యత్నిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో కనుక ఆస్ట్రేలియా జట్టు ఓటమిపాలైతే రెండు వన్డే మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను టీమిండియాకు కట్టబెట్టినట్టవుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అటు భారత్ అభిమానులు, ఇటు ఆసీస్ అభిమానులే కాకుండా క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్ ను తిలకిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News