: తల్లి స్థానంలో ఉన్న నన్నే ఆహ్వానించరా?: పురందేశ్వరిపై లక్ష్మీ పార్వతి ఫైర్


పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నందమూరి కుటుంబ వివాదాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఎల్లుండి జరిగే విగ్రహావిష్కరణకు తనను ఆహ్వానించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పేర్కొనగా.. తాజాగా లక్ష్మీపార్వతి తెరపైకి వచ్చారు. తనకూ ఆహ్వానం పంపలేదని ఆమె వాపోయారు. తల్లి స్థానంలో ఉన్న వ్యక్తిని నిరాదరణకు గురిచేయడం సబబు కాదని పురందేశ్వరికి హితవు పలికారు. ఇలాంటి వ్యక్తికి సోనియా ఎలా మంత్రి పదవి ఇచ్చారంటూ ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.

  • Loading...

More Telugu News