సదావర్తి భూముల వేలం: కొలిక్కి వచ్చిన సదావర్తి భూముల వేలం వ్యవహారం
- సదావర్తి భూములను దక్కించుకోనున్న రెండో బిడ్డర్ చదలవాడ లక్ష్మణ్
- మొదటి బిడ్డర్ డిఫాల్ట్ కావడంతో రెండో బిడ్డర్‌కు అవకాశం
- నిబంధనల ప్రకారం 50 శాతం డబ్బుని చెల్లించిన లక్ష్మణ్
- మొదటి బిడ్డర్ కంటే చదలవాడ లక్ష్మణ్ రూ.5 లక్షలు తక్కువ కోట్
ఎన్నో మలుపులు తిరిగిన సదావర్తి భూముల వ్యవహారం ఈ రోజు ఓ కొలిక్కి వచ్చింది. ఇటీవల ఈ భూములను వేలం వేయగా కడపకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ యజమానులు వాటిని రూ. 60 కోట్ల 30 లక్షలకు దక్కించుకున్న విషయం విదితమే. వారు డిఫాల్ట్ కావడంతో రెండో బిడ్డర్‌కు అవకాశం ఇస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నిన్న ప్రకటన చేశారు.
ఈ విషయంపై రెండో బిడ్డర్ సానుకూలంగా స్పందించారు. సదావర్తి భూములను రెండో బిడ్డర్ చదలవాడ లక్ష్మణ్ రూ.60.25 కోట్లకు పాడారు. నిబంధనల ప్రకారం ఈ రోజు 50 శాతం డబ్బుని చెల్లించారు. మొదటి బిడ్డర్ కంటే చదలవాడ లక్ష్మణ్ రూ.5 లక్షలు తక్కువ కోట్ చేశారు.