ఉక్రెయిన్‌ రాయబారి : ఎర్రకోట వద్ద సెల్ఫీ తీసుకుంటుండగానే నా చేతిలోంచి ఫోన్ కొట్టేశారు: ఉక్రెయిన్‌ రాయబారి

  • పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు
  • క్ష‌ణాల్లో జ‌రిగిపోయిన చోరీ 

ఓ దౌత్యాధికారి సెల్ఫీ తీసుకుంటుండ‌గా ఓ దొంగ‌ ఆయ‌న స్మార్ట్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటు చేసుకుంది. క్ష‌ణాల్లో జ‌రిగిపోయిన ఈ హఠాత్పరిణామానికి ఆయ‌న బిత్త‌ర‌పోయారు. ఈ విష‌యాన్ని ఆయ‌న మీడియాకు తెలిపారు. ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పోలిఖాకు ఎర్రకోటలో ఈ అనుభ‌వం ఎదురైంది. తాను ఢిల్లీ హోంశాఖ, పోలీస్‌ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాన‌ని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స్పందిస్తూ, నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టామ‌ని అన్నారు.    

  • Loading...

More Telugu News