DonaldTrump: మరోసారి ఉత్తరకొరియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్
- కిమ్ జాంగ్ ఉన్ ను పిచ్చివాడిగా అభివర్ణించిన ట్రంప్
- తన దేశ పౌరుల చావులను, ఆకలి బాధను సైతం పట్టించుకోడు
- విపరీత పరిణామాలను ఎదుర్కుంటాడని హెచ్చరిక
ఐక్య రాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంపై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందించి అమెరికాను మరోసారి హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు తాము మరోసారి హైడ్రోజన్ బాంబును పరీక్షిస్తామని కూడా ఉత్తరకొరియా ప్రకటన చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చివాడైన కిమ్ జాంగ్ ఉన్ తన దేశ పౌరుల చావులను, ఆకలి బాధను పట్టించుకోడని ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాధినేత ఇప్పటివరకు ఎదుర్కోని విధంగా విపరీత పరిణామాలను ఎదుర్కుంటాడని ట్రంప్ హెచ్చరించారు.