కోల్ కతా వన్డే: కోల్ కతా వన్డే: స్టీవెన్ స్మిత్ అర్ధసెంచరీ
- నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- ఆస్ట్రేలియా స్కోరు 26 ఓవర్లకి 121
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. టీమిండియా తమ ముందు ఉంచిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు హిల్టన్ కార్ట్‌రైట్, డేవిడ్ వార్నర్ లను భువనేశ్వర్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన స్టీవెన్ స్మిత్ ధాటిగా ఆడి అర్ధసెంచరీ చేశాడు.
ట్రావిస్ హెడ్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఛాహల్ బౌలింగ్‌లో మనీష్ పాండేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ ని కూడా 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఛాహెల్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 50, స్టోయినిస్ 5 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా స్కోరు 26 ఓవర్లకి 121గా ఉంది.