గుంటూరు: బాలుడిపై వీధి కుక్కల దాడి.. రక్తపు మడుగులో చిన్నారి బాధ వర్ణనాతీతం.. మృతి!
- గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులో హృదయ విదారక ఘటన
- చిన్నారి ఆడుకుంటుండగా ఆరు కుక్కల దాడి
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆరు వీధికుక్కలు కరిచి చంపేసిన ఘటన గుంటూరు నగర శివారులోని అడవితక్కెళ్లపాడులోని రాజీవ్ గృహకల్ప వద్ద చోటుచేసుకుంది. కుక్కలు దాడి చేయడంతో ప్రేమ్ అనే ఐదేళ్ల బాలుడు రోడ్డుపైనే కదలలేని స్థితిలో రక్తపు మడుగులోనే ఏడుస్తూ కనిపించాడు. ఆ చిన్నారిని గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.
అప్పటికే ఆ చిన్నారి చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏసు, మళ్లీశ్వరి. వారు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గాయాలతో ఆ చిన్నారి పడ్డ బాధ హృదయ విదారకంగా ఉంది. నెల రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ మహిళపై పందులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మర్చిపోక ముందే ఈ ఘటన జరిగింది. సంబంధిత అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.