భువనేశ్వర్ కుమార్: కోల్ కతా వన్డే: ఆదిలోనే రెండు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా తమ ముందు ఉంచిన 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ హిల్టన్ కార్ట్‌రైట్ (1 పరుగు) బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే భువనేశ్వర్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1 పరుగు).. అజింక్యా రహానేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు ఆరు ఓవర్లకి రెండు వికెట్ల నష్టానికి 22 గా ఉంది. క్రీజులో స్టీవెన్ స్మిత్ 7, ట్రావిస్ హెడ్ 11 పరుగులతో ఉన్నారు.