కంచ ఐలయ్య: కంచ ఐలయ్య ఇలా కులాలను కించపరచడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి ఫైర్
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకం రాసిన ప్రొ.కంచ ఐలయ్యపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి రచనలతో కులాలను కించపరచడం సరికాదని అన్నారు. కులాలను వివాదాస్పదం చేయాలని అంబేద్కర్ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. ఐలయ్య తీరు బాగోలేదని, రచయితలకు చెడ్డపేరు తెచ్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని అన్నారు. వైశ్యులపై ఇటువంటి రాతలు రాయడం అభ్యంతరకమని చెప్పారు. కాగా, సదావర్తి భూములను బహిరంగ వేలానికి పెట్టిన తర్వాత ఆ భూములపై విమర్శలు చేస్తూ ప్రతిపక్షం ప్రవర్తిస్తోన్న తీరు సరైంది కాదని సోమిరెడ్డి మండిపడ్డారు.