కేజ్రీవాల్: కమలహాసన్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నా: చెన్నైలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
కమలహాసన్ కి వీరాభిమానిని
మతతత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవారందరూ ఏకం కావాలి
కమల్ తో మళ్లీ చర్చిస్తా
మతతత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవారందరూ ఏకం కావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. చెన్నైలో సినీనటుడు కమలహాసన్‌ను కలిసి చర్చించిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తాను కమలహాసన్ వీరాభిమానినని అన్నారు. కమలహాసన్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో తాను మళ్లీ కమలహాసన్‌తో చర్చిస్తానని తెలిపారు. ఈ భేటీలో తాము తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా కమలహాసన్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌తో భేటీ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. మతతత్వం, అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాడుతున్నారని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తినవారందరూ తన ఆత్మీయులేనని తెలిపారు.