కమలహాసన్: కేజ్రీవాల్, కమలహాసన్ మీడియా సమావేశంలో గందరగోళం
చెన్నైలో సినీనటుడు కమలహాసన్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్, కమల్ ఇద్దరూ కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే, ఆ సమావేశంలో మొదట గందరగోళం నెలకొంది. వారిరువురినీ మాట్లాడనివ్వకుండా అక్కడ ఎవరివో అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్నవారంతా నిశబ్దంగా ఉండాలని, అక్కడి భద్రతా సిబ్బంది సూచనలు చేశారు. అయినప్పటికీ కాసేపు గందరగోళం నెలకొని, కాస్త ఆలస్యంగా మీడియా సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం కేజ్రీవాల్, కమలహాసన్ మాట్లాడుతున్నారు.