రఘువీరారెడ్డి: పంచె కట్టుకుని రైతులా ఆంధ్ర, కర్ణాటక బోర్డర్ లో పర్యటించిన రఘువీరారెడ్డి

  • అనంత పురాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయ‌డం లేదు
  • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
  • రాష్ట్ర స్థూల‌ ఆదాయంలో 2003లో అనంతపురం జిల్లా 3వ స్థానంలో
  • ఇప్పుడు 13వ స్థానంలో

ఆంధ్ర, కర్ణాటక బోర్డర్‌లోని నీలకంఠాపురంలో ఏపీసీసీ అధ్య‌క్షుడు రఘువీరా రెడ్డి ప‌ర్య‌టించి అక్క‌డి పంట పొలాలను పరిశీలించారు. పంచె కట్టుకుని రైతులా కలియ తిరుగుతూ అక్కడ జరుగుతోన్న వ్యవసాయ పనుల గురించి తెలుసుకున్నారు. ఆయ‌న‌తో పాటు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ , పాకాల సూరి బాబు కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ... అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిందని అన్నారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌లేద‌ని చెప్పారు.

రాష్ట్ర స్థూల‌ ఆదాయంలో 2003లో అనంతపురం జిల్లా 3వ స్ధానంలో ఉంటే ఇప్పుడు 13వ స్థానంలో ఉంద‌ని విమ‌ర్శించారు. 175 నియోజకవర్గాలలోను తలసరి ఆదాయం పరంగా చూస్తే, అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం 174వ స్థానంలో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దత్తతకు తీసుకున్న అరకు ప్రాంతం 172వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమ‌ని విమ‌ర్శించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులను ప్రారంభిస్తామ‌ని తెలిపారు.  

  • Loading...

More Telugu News