: వేలి ముద్ర వేస్తేనే చౌకధర దుకాణాల్లో సరుకులు


రాష్ట్రంలోని చౌక ధర దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానంలో అర్హులైనవారు తమ వేలిముద్రలు వేస్తేనే చౌక ధర దుకాణాల్లో సరుకులు ఇస్తారు. ముందుగా ఈ బయోమెట్రిక్ విధానాన్ని పది జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాకు 100 చొప్పున మొత్తం వెయ్యి చౌకధర దుకాణాల్లో ఈ కొత్త విధానం అమలు కానుంది. ఈ బయోమెట్రిక్, ఎలక్ట్రానిక్
తూనికల విధానం ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి, విశాఖ, కరీంనగర్, మహబూబ్ నగర్, చిత్తూరు, కడప, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో  అమలులోకి రానుంది. 

  • Loading...

More Telugu News