గోల్డ్: ఈ రోజు కాస్త పెరిగిన బంగారం ధర!
బంగారం ధర ఈ రోజు కాస్త పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధర రూ.150 పెరిగి, పది గ్రాముల ధర రూ.30,750గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధర రూ.400 పెరిగి, రూ.40,900లకు చేరింది. కొన్ని రోజులుగా బంగారం ధరలు ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. పండుగ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ బాగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.