: దాడివి ఊసరవెల్లి రాజకీయాలు: కొణతాల
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన దాడి వీరభద్రరావు ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతున్నాడని వైఎస్సార్సీపీ అసమ్మతి నేత కొణతాల లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ సాయంత్రం అనకాపల్లిలో కొణతాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. దాడిని చేర్చుకోవడంతో వైఎస్సార్సీపీ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చిన లక్ష్మీనారాయణ చెప్పినట్టుగానే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.
దాడి రాజకీయాలను వ్యాపారంగా మలుచుకుని కోట్లు సంపాదించాడని కొణతాల అన్నారు. ఏ పార్టీలో రాజకీయంగా ఎదిగాడో, ఆ పార్టీని నట్టేట ముంచిన మోసగాడు దాడి అని విమర్శించారు. వైఎస్సార్సీపీలో కుట్రలు పన్నితే చూస్తే ఊరుకోబోమని కొణతాల హెచ్చరించారు.