కేటీఆర్: రాష్ట్ర వ్యాప్తంగా అవాంతరాలు లేకుండా చీరల పంపిణీ జరుగుతోంది: మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ విషయంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ చీరల పంపిణీపై జౌళిశాఖ అధికారులతో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని కేంద్రాల్లో ఎన్ని చీరల పంపిణీ జరిగిందో చెప్పాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవాంతరాలు లేకుండా చీరల పంపిణీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. చీరలు అందించే ప్రక్రియను ఎల్లుండితో ముగించాలని అన్నారు.