ధోనీ: ఈ సారి మాత్రం ధోనీని తొందరగా ఔట్ చేస్తాం: ఆస్ట్రేలియా బౌలర్

  • ఎల్లుండి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌ స్టేడియంలో రెండో వన్డే
  • ధోనీపై ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా ప్రశంస‌ల జ‌ల్లు

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ఎల్లుండి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌ స్టేడియంలో రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. మొద‌టి వ‌న్డేలో ఓడిన ఆస్ట్రేలియా రెండో వ‌న్డేలోనైనా గెల‌వాల‌ని క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆస్ట్రేలియన్ స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా మీడియాతో మాట్లాడుతూ.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొద‌టి వ‌న్డేలో అద్భుతంగా రాణించిన‌ టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీపై ప్రశంస‌ల జ‌ల్లు కురిపించాడు. ధోని వికెట్ చాలా ముఖ్య‌మైంద‌ని ఆయ‌న అన్నాడు.

క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే ధోనీని సాధ్యమైనంత తొందరగా అవుట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని ఆడమ్ జంపా తెలిపాడు. అయితే, మొన్న జ‌రిగిన వ‌న్డేలో ధోనీని తొందరగా ఔట్ చేయాల‌న్న త‌మ‌ ప్రయత్నం ఫలించలేదని చెప్పాడు. రెండో వ‌న్డేలో మాత్రం ధోనీని తొంద‌ర‌గా వెనుదిరిగేలా చేస్తామ‌ని అన్నాడు. ధోనీని తొంద‌ర‌గా క‌ట్ట‌డి చేస్తే మ్యాచ్‌పై ప‌ట్టుసాధించవచ్చని తెలిపాడు.  

  • Loading...

More Telugu News