దినకరన్: ‘బాహుబలి’లోని కట్టప్పలా పన్నీర్ సెల్వం వెన్నుపోటు పొడిచాడు: దినకరన్
- తన వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వేటు వేయడంపై ఆగ్రహం
- జరుగుతున్నదంతా తమిళనాడు ప్రజలు చూస్తున్నారు
- ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
- ఈపీఎస్‌ను శశికళే సీఎంను చేసింది
తన వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వేటు వేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని దినకరన్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జరుగుతున్నదంతా తమిళనాడు ప్రజలు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆరోపించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మోసగాళ్లుగా గుర్తుండిపోతారని వ్యాఖ్యానించారు.
ఈపీఎస్‌ను శశికళే సీఎంను చేసిందని, పన్నీర్ సెల్వం బాహుబలి సినిమాలోని కట్టప్పలా తమను వెన్నుపోటు పొడిచాడని దినకరన్ అన్నారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను పోలీసులు ఉగ్రవాదులను వెంటాడినట్టు వెంటాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసిన విషయంలో హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని అన్నారు.