కైలాశ్ సత్యార్థి: అప్పుడు, నా ట్విట్టర్ పోస్టుపై చంద్ర‌బాబు నాయుడే మొద‌టగా స్పందించారు: కైలాశ్ సత్యార్థి

  • ‘భార‌త యాత్ర‌’ చేస్తోన్న కైలాశ్ సత్యార్థి
  • చంద్రబాబుతో కలిసి కర్నూలులో పిల్లలతో ముచ్చట
  • ‘భార‌త యాత్ర‌’కు సంకల్పించిన‌ప్పుడు ట్విట్ట‌ర్ లో పోస్టు చేశా
  • భార‌తదేశాన్ని బాల‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే దేశంగా తీర్చిదిద్దాలి

తాను ‘భార‌త యాత్ర‌’కు సంకల్పించిన‌ప్పుడు ట్విట్ట‌ర్ లో పోస్టు చేశాన‌ని, అప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడే దానిపై మొద‌టగా స్పందించారని నోబెల్ శాంతి పుర‌స్కార‌ గ్రహీత కైలాశ్ స‌త్యార్థి అన్నారు. క‌ర్నూలు జిల్లాలోని ఏపీఎస్పీ బెటాలియ‌న్ మైదానంలో ఈ రోజు ‘బాల‌ల భ‌ద్ర‌తే భార‌త భ‌ద్ర‌త’ పేరుతో బ‌హిరంగ స‌భ జ‌రిగింది. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, నోబెల్ శాంతి పురస్కార గ్ర‌హీత కైలాశ్ స‌త్యార్థి పాల్గొన్నారు. విద్యార్థుల‌తో మాట్లాడించి వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కైలాశ్ సత్యార్థి మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారని చెప్పారు. పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డంతో పాటు బాల‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌ని తాను కోరుతున్నాన‌ని చెప్పారు. పిల్ల‌లు సంతోషంగా ఉండ‌డానికి అంద‌రం క‌లిసి కృషి చేద్దామ‌ని వ్యాఖ్యానించారు. భార‌తదేశాన్ని బాల‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించే దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కైలాశ్ సత్యార్థి.. చిన్నారులపై వేధింపులు, అక్రమ రవాణాను అరికట్టే దిశగా చేపట్టిన ‘భారత్ యాత్ర’ లో ఉన్నారు. ఆయన మొత్తం 22 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.   

  • Loading...

More Telugu News